జివిఎంసీ అమలు చేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, భారత ప్రభుత్వం (UNDP-GoI)ప్రాజెక్టులో భాగంగా కమిషనర్ డా. జి. సృజన సుస్థిరత మరియు స్థితిస్థాపకత (Sustainability and Resilience Programme(SRP))ను శుక్రవారం ప్రారభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ ఎస్ఆర్పీ కార్యక్రమానికి నోడల్ అధికారులుగా జివిఎంసి అదనపు కమిషనర్లు ఆషా జ్యోతి, డా. వి. సన్యాసి రావు, వ్యవహరిస్తారని కమిషనర్ తెలిపారు. ఇందులో జివిఎంసి పరిధిలో అందరు ఉన్నతాధికారులు, మేయర్, కార్పొరేటర్లు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం దీర్ఘకాలిక సుస్థిరత సాధించడానికి సంస్థాగత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన వివిధ అభివృద్ధి కార్యకాలాపాలలో నగరానికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఈ సస్టైనబిలిటీ , రెసిలిఎన్స్ యూనిట్ (SRU) కార్యక్రమాన్ని , దాని రాబోయే సెల్ఫ్ ఎన్విరాన్మెంట్ సెల్, క్లైమేట్ సెల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, హ్యూమన్ రీసోర్సు డెవలప్మెంట్ సెల్ ద్వారా అమలు చేస్తుందని కమిషనర్ తెలిపారు. మేయర్, కార్పొరేటర్లను ప్రస్తుత, భవిష్యత్ అత్యవసర పరిస్థితులను మెరుగైన రీతిలో ఎదుర్కోవడానికి సస్టైనబిలిటీ మరియు రెసిలిఎన్స్ ప్రోగ్రాం బృందానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా కోవిడ్-19 సెకండ్ వేవ్ , భవిష్యత్ సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విపత్తుల ప్రమాదాన్ని తగ్గించడంలో కార్యకలాపాలను వార్డు స్థాయిలో సంబంధిత కార్పొరేటర్లు చేపట్టడానికి అవకాశం వుంటుందన్నారు. వార్డు సచివాలయాలు, ప్రజలు , ఇతర లబ్దిదారులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, అవగాహన , అత్యవసర స్పందన సామర్ధ్యం పెంపొందించడం మొదలైన కార్యక్రమాలు ఇందులో ఉంటాయని కమిషనర్ చెప్పారు.