కోవిడ్ వైద్యసేవల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు..


Ens Balu
3
Collector Office
2021-05-21 13:05:01

ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు వైద్యం అందించడములో  అలసత్వాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ వైద్యాధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మరియు ఇతర అధికారులతో కోవిడ్ వ్యాధి చికిత్స, ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ సరఫరా, వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు మొదలగు విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఆసుపత్రులలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎల్లప్పుడు వార్డులలో తిరుగుతూ పేషెంట్లకు వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థతిని నిరంతరం పరిశీలిస్తూ వుండాలన్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ వుండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి., ఆర్.ఇ.హెచ్, సైకియాట్రి మొదలగు టీచింగ్ ఆసుపత్రులలో సమస్యలపై చర్చించారు. ఛాతీ ఆసుపత్రి, ఇ.ఎన్.టి. ఆసుపత్రులకు  అవసరమైన స్టాఫ్ నర్సులు, నర్సులను నియమించాలని ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డా.పి.వి.సుధాకర్ కు సూచించారు.  ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలండర్స్ విషయంపై చర్చించారు. ఆక్సిజన్ పూర్తిగా అయిపోయినప్పుడు కాకుండ తగు స్థాయిలో వుండగానే మేల్కొని తెలియజేయాలని, ఈ విషయంలో ఆప్రమత్తంగా వుండాలన్నారు.
ఆక్సిజన్ స్థాయి 90-94 వరకు వున్న పేషెంట్లను టీచింగ్ ఆసుపత్రులలో తప్పని సరిగా ఎడ్మిట్ చేసుకొని వైద్య సేవలు అందించాలన్నారు.  ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఈ నాలుగు ఆసుపత్రులను పరిశీలించాలన్నారు. కేవలం  కోమార్పిడిటీస్ తో బాధపడుతున్న సీరియస్ కేసులను మాత్రమే కె.జి.హెచ్. విమ్స్ లకు పంపించాలన్నారు. అనస్థీషియా, టెక్నీషియన్ల నియమాకినికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటిలేటర్లు అన్నింటినీ  ఒకే చోటకు తీసుకువచ్చి  సాంకేతిక నిపుణులతో అవసరమైన మరమ్మత్తులు గావించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులకు కే.జి.హెచ్. లోనే ట్రీట్మెంట్ గావించాలన్నారు. కమిటీ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందించాలన్నారు.  
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీలు
  జిల్లాలో 57 ప్రైవేటు ఆసుపత్రులలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, బెడ్స్, తదితర విషయాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టరు ఆదేశించారు. జాయింట్ కలెక్టరు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆర్.డి.ఒ.లు తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఆసుపత్రులలో బెడ్స్ విషయమై ఇప్పటికే సూచించిన విధముగా సాఫ్ట్ వేరు ను త్వరగా తయారు గావించాలని ఎ.డి.(సర్వే) మనీషా త్రిపాఠి ను అదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరులు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్  అధికారి ఎస్.వెంకటేశ్వర్, ఎ.ఎమ్.సి. ప్రిన్సిపాల్ డా. సుధాకర్, కె.జి.హెచ్ సూపరింటెండెంట్  డా. మైథిలీ, డి.ఎం.హెచ్.ఒ. డా.సూర్యనారాయణ, ఆర్.సి.హెచ్, ఆర్.ఇ హెచ్., ఇ.ఎన్.టి, సైకియాట్రి ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఎ.డి (డ్రగ్స్)రజిత, జి.ఎం.డి.ఐ.సి.రామలింగరాజు, ఎపి.ఎం.ఎస్ ఐ.డి.సి, ఇ.ఇ, డి.ఎ.నాయుడు, తదితర అధికారులు హాజరయ్యారు.

సిఫార్సు