అధికారులు అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
3
Collector Office
2021-05-21 13:33:03

విశాఖజిల్లాలో సైక్లోన్ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు.  కలక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని విధులలో వుంచాలని డి.ఆర్.ఒ.ను ఆదేశించారు. హాస్పటల్ డిజాస్టర్ ప్రణాళికను సిద్థం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులలో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా బ్యాక్ అప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తహశీల్దారులకు 10-15 మంది లైన్ మెన్ లను అందుబాటులో వుంచాలన్నారు. విద్యుత్తు శాఖ ఇంజనీర్లతో ఈ విషయాలపై చర్చించి తగు ముందస్తు ఏర్పాట్లు  చేసుకొని తహశీల్దారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సిఫార్సు