కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్కరణలు తిప్పికొట్టాలి..


Ens Balu
4
GANDHI STATUE, OPP GVMC, VIZAG
2020-08-28 18:22:34

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను యావత్‌ ప్రజానీకం త్రిప్పికొట్టాలని వామపక్ష పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యు త్‌ అమరవీరుల 20వ వర్ధంతి సందర్భంగా జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద విద్యుత్‌ అమరవీరులకు నివాళర్పిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యుత్‌ సంస్కరణలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సిపిఐ(ఎంఎల్‌) న్యూడె మోక్రసి జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, సిపిఐ(ఎంఎల్‌) నాయకులు గణేష్‌పాండా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాం కు విధానాలనే అనుసరించడంతో ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపాడని, దాంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలంతా తిరుగుబాటు చేసారన్నారు. విద్యుత్‌ చార్జీలు రద్దు చేయాలని వామపక్షపార్టీల పిలుపుమేరకు 2000 ఆగష్టు 28న చలో హైదరాబాద్‌ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పోలీస్‌లతో కాల్పులు జరిపించి, బాష్పవాయు వును ప్రయోగించడంతో ముగ్గురు యువకిశోరాలైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలను పొట్టనపెట్టుకున్నాడన్నారు.