కెజిహెచ్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం..


Ens Balu
4
King George Hospital
2021-05-21 13:38:01

విశాఖ కె.జి.హెచ్.లో నూతనంగా నిర్మించిన సహజ సిద్దమైన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్ అంతటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  ఆక్సిజన్ తయారీ విధానంగా గూర్చి కలెక్టర్ అడుగగా వాతావరణం నుండి సేకరించిన గాలి నుండి ఆక్సిజన్ నిల్వ, సరఫరా చేయు విధానం గూర్చి ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్ వివరించారు.   కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను కె.జి.హెచ్.లోని నర్సింగ్ కళాశాల వసతి గృహంనకు ప్రక్కనే నిర్మించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మిషనరీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సివిల్ పనులు కలిపి 3.4 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు.  రోజుకు 400 వందల ఆక్సిజన్ సిలిండర్లు (2 x 1000 LPM ప్లాంట్) ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్. సూపరింటెండెంట్ డా. మైథిలి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ. నాయుడు, ప్రొఫెసర్ డా. ఎం.విజయ శేఖర్, డా. మనోజ్ పాత్రుని, ఎలక్ట్రికల్ డి.ఇ. ఫణి కుమార్, డి.ఇ.ఇ. సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.  

సిఫార్సు