జగనన్నతోడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-05-21 14:30:52

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జగనన్నతోడు పధకం అమలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగనన్న తోడు, పిఎం స్వానిధి పై జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(DCCB) సిఇఒ వర్మ, యుసిడి(ప్రాజెక్ట్ డైరెక్టర్)  వై. శ్రీనివాసరావు, 18 బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు,  యుసిడి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు, జూన్ 8వ తేదీన ప్రారంభమవుతుంది. కావున అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీలోగా జగనన్న తోడు,  పీఎం కిసాన్ నిధి, క్రింద జీరో అకౌంట్ ఖాతాలను తెరవాలని యుసిడి(పిడి) వై.శ్రీనివాసరావు ఆదేశించారు. జూన్ 2వ తేదీ నాటికి 9381 ఖాతాలు తెరవాలని టార్గెట్ ఇవ్వడం జరిగిందని, అందుకు బ్యాంకులు  సహకరించాలని కమిషనర్ ఆదేశించారు. అర్హులైన పేద ప్రజలకు ఏవిధమైన అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఈ పథకం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎపిడి లు, డిఎంసి లు, వార్డు వెల్ఫేర్ కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ  మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. జిల్లా కోపరేట్ సెంట్రల్ బ్యాంకు సిఇఒ వర్మ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ “జీరో” ఎకౌంటుతో ఖాతాలు తెరుస్తారని  అందుకు బ్యాంకులు కూడా సహకరిస్తాయని కమిషనర్ కు తెలిపారు. యుసిడి(పిడి) వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నాటికి  జగనన్న తోడు 5063 ఖాతాలు మరియు పీఎం స్వానిధి 4258 ఖాతాలు మొత్తం 9321 ఖాతాలు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే 1036 ఖాతాలు తెరవడం అయిందని, మిగిలినవి జూన్ 2వ తేదీ నాటికి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సిఎఒ వర్మ, యుసిడి(పి.డి)  వై. శ్రీనివాసరావు, ఎపిడిలు, డిఎంసిలు, 18 బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు