విశాఖలో కోవిడ్ రోగులకు మరో 30 పడకలు..


Ens Balu
2
Visakhapatnam
2021-05-21 14:36:37

విశాఖలోని రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేయాలని నోడల్ అధికారి, ఐటీడీఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పెదవాల్తేర్ రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిని శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈనెల22 నుంచి కోవిడ్ పేషేంట్లకు ఈ ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్లకు సేవలను అందిస్తామని చెప్పారు. అనంతరం ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఆసుపత్రికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరగా రెండు అంబులెన్స్ లు  సమకూరుస్తున్నామని పీఓ హామీఇచ్చారు. ఆతరువాత రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ కోవిడ్ పేషేంట్లకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో రాణి చంద్ర మణి దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీనివాసరావు, ఎపి  మైనారిటీ కార్పొరేషన్ ఈ డి ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఈ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు