రేపటి నుంచి 2వ డోసు వేక్సినేషన్..
Ens Balu
5
GVMC office
2021-05-21 14:51:47
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో కోవేక్షిన్(Covaxin) 15000 సెకండ్ డోస్ లు, 7000 కోవిషీల్డ్ (Covisheild)2వ డోస్ లు వేయించుకోవలసినవారు మొత్తంగా 23000 మంది ఉన్నారని, ఈ సెకండ్ డోస్ వేయించుకోవలసినవారి కొరకు జివిఎంసి కమీషనర్ డా. జి. సృజన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మే 22 నుంచి 25 వరకు ఉదయం 7 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు ప్రత్యేకంగా(డ్రైవ్) నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దానికోసం జివిఎంసీ వార్డుల్లోని అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మ్యాపింగ్ చేసినట్టు వివరించారు. ఈ క్రింది కొవిడ్ వ్యాకినేషన్ కేంద్రలలో కోవిషీల్డ్ 84 రోజులు పైబడిన వారు, కోవేక్షిన్ 28 రోజులు పైబడిన వారు మాత్రమే వ్యాకినేషన్ చేయించుకోవాలన్నారు. మొదటి డోస్ వ్యాకినేషన్ జూన్ మొదటి వారంలో మొదలు అవుతుందని చెప్పారు. ఈ క్రింది పేర్కొన్న వార్డ్స్ లో టోకెన్ల ప్రకారం కేంద్రానికి వెళ్లి సెకండ్ డోస్ వ్యాకినేషన్ వేయించుకోవాలన్నారు. వ్యాకినేషన్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆదార్ కార్డు కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తో పాటు జివిఎంసీ SMS కూడా చూపించి కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని కమిషనర్ కోరారు..