బ్యాంకులు గ్రామాల వారీగా రోజూ షెడ్యులు ప్రకటించాలి..
Ens Balu
2
Srikakulam
2020-08-28 18:33:53
ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని ప్రజలు నగదుగా తీసుకునేందు బ్యాంకులు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శుక్ర వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బ్యాంకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల సంక్షేమానికి ఆర్ధిక సహాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాల క్రింద లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతోందని దానిని లబ్ది దారులు బ్యాంకుల నుండి పొందుటకు తగు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. కోవిడ్ దృష్ట్యా బ్యాంకు శాఖలలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండకుండా చూడాలని అందు లో భాగంగా గ్రామాల వారీగా షెడ్యూలు ప్రకటించాలని సూచించారు. ఆయా గ్రామాలకు కేటాయించిన తేదీలలో లబ్దిదారులు బ్యాంకుల వద్దకు వచ్చి నగదును పొం దగలరని పేర్కొన్నారు. ప్రకటించిన తేదీలను డి.ఆర్.డి.ఓ ఏపిఎంలు స్వయం సహాయక సంఘాల ద్వారా సమాచారం అందిస్తారని చెప్పారు. కోవిడ్ కారణంగా బ్యాం కు శాఖలలో సోడియం హైపోక్లోరైడ్ శానిటైజేషన్ చేయాలని కలెక్టర్ అన్నారు.