విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న) వారి దేవస్థానం శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖ మాధవధారకు చెందిన ధవళ వెంకట రమణ కుటుంబ సభ్యులు రూ.1,11,111 (లక్షా పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు) విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును దేవస్థానం అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ప్రతీ భక్తుడికీ చేరాలనే ఉద్దేశ్యంతో తమవంతుగా ఈ విరాళం సమర్పించినట్టు చెప్పారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.