హౌసింగ్ స్కీమ్ పనులు 90శాతం పూర్తి..


Ens Balu
3
Cheepurupalli
2021-05-22 09:40:08

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు(హౌసింగ్) పథకం పనులను సత్వరమే పూర్తిచేయాలని చీపురుపల్లి మండల ప్రత్యేక అధికారిణి ఎన్.నిర్మలకుమారి  అధికారులను ఆదేశించారు. శనివారం చీపురుపల్లి మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామక్రిష్ణరాజు , ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలం హౌసింగ్ లో తొలి స్థానంలో నిలిపేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్రుషిచేయాలన్నారు. మండలంలోని 16లేవుట్లలో ప్రతీ లేవుట్ కి రెండు ఇళ్లు చొప్పు 32 మోడల్ ఇళ్లను నెలాఖరు నాటికి ప్రారంభించాలని సూచించారు. 1612 మంది లబ్దిదారులకు సంబంధించిన ఇళ్లు మ్యాపింగ్ నూరుశాతం పూర్తిచేశామన్న ఆమె 1605 ఇళ్లకి జియోట్యాగింగ్ పూర్తికాగా,  1481 జాబ్ కార్డులను పంపిణీ చేసినట్టు వివరించారు.  1596 ఇళ్లకి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేశామన్నారు.  165 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందని వివరించారు. త్వరలోనే హౌసింగ్ పనులు ప్రారంభిస్తారని అన్నారు.  లబ్దిదారులను సంప్రదించి మిగిలిఉన్న పనులు పూర్తిచేలని ప్రత్యేక అధికారి ఎన్.నిర్మలకుమారి కోరారు. కార్యక్రమంలో మడలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు