ఇలాగేనా ప్రజలకు సేవలు చేయడం..


Ens Balu
3
Visakhapatnam
2021-05-22 12:09:30

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలి తప్పితే గైర్హాజరు దోరణితో పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి హెచ్చరించారు. శనివారం నగరంలోని నాలుగవ జోన్ పరిధిలో 38, 39వ వార్డులలోని పలు సచివాలయాలను మేయర్  ఆకస్మికంగా తనిఖీ చేసారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మేయర్ వెలంపేట-1, వేలంపేట-3, అంబుస్వరంగా వీధిలోని వార్డు సచివాలయాలను సందర్శించి హాజరు పట్టికను, మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీల రిజిస్టర్ ను తనిఖీ చేసి వాటి నిర్వాహణ సరిగా లేదని, చాల వరకు ఆర్జీలు పెండింగులో ఉన్నాయని వాటిని సరిగా నిర్వహించకపోతే తగు చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. కొంతమంది వార్డు కార్యదర్శులు విధులకు హాజఋ కాకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అన్ని సేవలు అందాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, పేద ప్రజలకు అందవలసిన అన్ని సంక్షేమ పధకాలు వారికి సకాలంలో చేరాలని మేయర్ కార్యదర్సులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాలుగవ జోన్ జోనల్ కమిషనర్ ఫణిరాం, సూపరింటెండెంట్  బాబురావు, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.