పర్యావరణ ముసాయిదాను రాష్ట్రాలు వ్యతిరేకించాలి..
Ens Balu
3
విశాఖపట్నం
2020-08-28 18:42:15
కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ ముసాయిదా కార్పొరేట్ సంస్థల అభివృద్ధి కోసం ఆదివాసీ చట్టాలను త్రుంగలో తొక్కిందని మాజీ ఐ.ఎ.ఎస్ అధికారి ఇఏఎస్ శర్మ అన్నారు. శుక్రవారం గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పి.అప్పలనర్స అధ్యక్షత ను వెబ్ నార్ (ఆన్ లైన్ సెమినార్) ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ.ఎ. ఎస్ శర్మ గారు మాట్లాడుతూ, ఈజీ డుయింగ్ బిజినెస్ పాలసీ పేరుతో కార్పొరే ట్ సంస్థలకు దాసోహం కావడం చట్టవ్యతిరేకమైనదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇందిర గాంధీ ప్రభుత్వం 48(ఏ) తీసుకువచ్చి పర్యావరణ మంత్రిత్వ శా ఖ ను ఏర్పాటు చేశారని, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విధాన ముసాయిదా 2020 ఉందని విమర్శించారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబూరావు మాట్లాడుతూ పర్యావరణ విధాన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతి రేకంగా పోరాటం చేయాలని లేదంటే గిరిజనులు నిర్వసితులుగా మారిపోతారన్నారు.