వేక్సిన్ లేదనే మాట రావడానికి వీల్లేదు..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-05-22 13:19:06

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అర్భన్ పీహెచ్సీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరికీ కోవిడ్ వేక్సినేషన్ చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన, మేయర్ గొలగాని హరి వెంకట కుమారిలు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని 8వ జోన్ పరిధిలో 95, 96వ వార్డుల్లోని అర్బన్  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చిన ప్రతీ ఒక్కరికి రెండవ డోస్ వేయాలని సూచించారు. వ్యాక్సిన్ లేదని తిరిగి వెళ్ళ కూడదన్న వారు కొవీషీల్డ్ 84 రోజుల పైబడిన వారికి, కోవేక్షిన్ 28 రోజుల పైబడిన వారికి వేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు శనివారం నుంచి   తేది.25.05.2021వ తేది వరకు నగరంలో ప్రతి అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వేక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రస్తుతం రెండవ డోస్ మాత్రమె వేస్తున్నామన్న వీరు జూన్ మొదటి వారంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ మొదలు పెడతామని చెప్పారు.  మొదటి డోస్ ఏ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లు రద్దీ దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుగుకోవాలని సూచించారు. గోపాలపట్నం అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. ఈ పర్యటనలో8వ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఎఎంఒహెచ్ లక్ష్మి తులసి, వై.సి.పి. నాయకులు బెహర భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.        
సిఫార్సు