రేపు విశాఖలో మాంసం అమ్మకాలు నిషేధం..


Ens Balu
5
విశాఖసిటీ
2021-05-22 13:21:38

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధిస్తున్నాట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

సిఫార్సు