ఇంజనీరింగ్ పనులు నాణ్యతతో చేపట్టాలి..
Ens Balu
2
విశాఖ సిటీ
2021-05-22 13:23:17
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధి చేపట్టిన ఇంజనీరింగ్ పనులను నాణ్యతలో రాజీలేకుండా చేపట్టాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని రెండవ జోన్ లోని 7వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మిదిలాపురి ఉడా కోలనీ లో రూ. 78.00 లక్షల తో నూతనంగా నిర్మించదలచిన డ్రైనేజి పనులను కూడా పరిశీలించి వాటికి అంగీకారం తెలిపారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. ఆ తరువాత స్థానిక ప్రజలతో మాట్లాడారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్య సిబ్బందికి తడి – పొడి చెత్తను వేరు వేరుగాచేసి ఇవ్వాన్న కమిషనర్ కాలువలలో చెత్త వేయరాదని సూచించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు శ్యాంసన్ రాజు, రెండవ జోన్ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, కార్యనిర్వాహక ఇంజినీరు శంకర్, సహాయక ఇంజినీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.