కోవిడ్ నియంత్రణ సహాయం రూ.50.5లక్షలు..
Ens Balu
3
Kakinada
2021-05-22 14:23:18
కోవిడ్ నియంత్రణ చర్యలతో పాటు బాధితులకు వైద్య, ఇతర సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలకు తూర్పుగోదావరి సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ చేయూత నందించింది. శనివారం అసోసియేషన్ ప్రతినిధులు యార్లగడ్డ వీర్రాజు, దాట్ల దిలీప్, ద్వారంపూడి వీరభద్రరెడ్డి.. రూ.50,50,000 చెక్కును కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి అందజేశారు. రెండో దశ కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా కోవిడ్ సహాయ నిధికి విరాళం అందించిన జిల్లా సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్‌కు కలెక్టర్, శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ విపత్తును ఎదుర్కోవడంలో వివిధ కార్పొరేట్, వ్యాపార, వాణిజ్య సంస్థలు భాగస్వాములు అవుతున్నాయని, ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జేడీ పీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.