విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏర్పడే తుఫాన్, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున జివిఎంసి అప్రమత్తం అయిందని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ వలన చెట్లు, కొమ్మలు విరిగిపడ్డా, గెడ్డలు పొంగి రహదారిపైకి ఇళ్ళలోనికి నీరు చేరి ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరు 1800 4250 0009 లేదా 0891-2869100 సమాచారాన్ని అందజేయాలని ఆమె కోరారు. జివిఎంసి సిబ్బంది ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. 24 గంటలు సమస్యలు తీసుకోవడం కోసం జివిఎంసి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు..