విశాఖలోని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏర్పడే తుఫాన్, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఒక ప్రకటనలో తెలియజేశారు. తుపాను వలన జరిగిన నష్టాలను పేర్కొన్న కంట్రోల్్ రూమ్ కి సమాచారం ఇవ్వడం ద్వారా రెవిన్యూ అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవడానికి వీలుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లోని తహశీల్దార్లను తుపాను ద్రుష్ట్యా అప్రమత్తం చేసినట్టు కలెక్టర ఆ ప్రకటనలో వివరించారు. అత్యవసర సమయంలో ప్రజలు కంట్రోల్ రూం నెంబర్లు 0891-2590102, 0891-2590100 లో సంప్రదించాలన్నారు.