యాష్ తుపాన్ ను ఎదుర్కోవడాని సన్నద్దం..
Ens Balu
2
Vizianagaram
2021-05-22 15:17:19
విజయనగరం జిల్లాలో యాష్ తుపాన్ ప్రభావం ఎదుర్కోవడానికి సన్నద్దంగా ఉన్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి చెప్పారు. తుపానుపై ముందస్తు చర్యలల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తో వీడియో కాన్ఫరెన్సు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి అన్ని మండలాల ఎఫ్ డీఓలకు సమాచారం అందించామన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న గజఈతగాళ్ల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా మరబోట్లను కూడా సిద్ధం చేయాలని తమ క్రిందిస్థాయి సిబ్బందికి సూచించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జగకుండా ఉండేలా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు హెచ్చరికలు జారీచేశామన్నారు. గ్రామాల్లోని మత్స్యకార మిత్రల ద్వారా మత్స్యకారులకు కూడా తుఫాను పై అప్రమత్తంగా ఉండేలా చేయాలని సూచించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్ లకు అత్యవసర పరిస్థితుల సమాచారం అందించే విధంగా మత్స్యకారులను చైతన్యం చేస్తున్నామన్నారు.