కోవిడ్ ఫలితాలు మరింత త్వరగా రావాలి...జిల్లా కలెక్టర్


Ens Balu
4
Visakhapatnam
2020-08-28 18:59:39

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నమూనాల పరీక్షా ఫలితాలు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో పెతాలజి, రేడియాలజీ తదితర విభాగాల లాబ్ ఇన్ ఛార్జిలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. నమూనాలు సేకరించిన అనంతరం అతి త్వర గా ఫలితాలు వెల్లడించడం ద్వారా వ్యాధి లక్షణాలు లేని పాజిటివ్ కేసులు బయట తిరగకుండా నిరోధించగలమన్నారు. తద్వారా వ్యాప్తికి అవకాశం ఉండదని పేర్కొ న్నారు. ఐసియులో ఉన్న పేషెంట్లకు అవసరమగు పరీక్షలలో ఎటువంటి జాప్యం జరగరాదని ఆయన స్పష్టం చేసారు. పరీక్షా ఫలితాలకు అనుగుణంగా మంచి వైద్య చికిత్సను అందించవచ్చని అన్నారు. అతి తీవ్రతగల కేసులకు ప్లాస్మా చికిత్స అందించుటకు ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, వైద్య సి బ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని, అయితే దానికి పూర్తి సార్ధకత చేకూరుటకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చేరిన ఏ ఒక్క వ్యక్తి మృతి చెందకుండా అవసరమగు అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.