ప్రైవేటు సంస్థ ఉద్యోగులకూ కోవిడ్ టీకా..


Ens Balu
3
Kakinada
2021-05-22 15:39:17

ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే 45 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు ఈ నెల 24, 25, 26 తేదీలలో డివిజన్  కేంద్రాలో మొదటి డోస్ కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిర్వహించనున్నామని జిల్లా కలక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. శనివారం రాత్రి జిల్లాకలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజనల్ అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల ఉద్యోగులకు తొలి విడత కోవిడ్ వాక్సిన్ నిర్వహణ గురించి ఆదేశాలు జారీ చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సోమ, మంగ్ల, బుధ వారాలలో ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో పనిచేస్తున్న 45 ఏళ్లుదాటిన ఉద్యోగులకు కోవిడ్ తొలివిడత టీకాలు వేసేందుకు అన్ని డివిజన్ కేంద్రాలలో మూడు రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించాలని డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లను కోరారు. ఈ కేంద్రాలలో కేవలం 45 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రమే టికాలు పంపిణీ చేయాలని, వారి కుటుంబ సబ్యులకు జూన్ మొదటి వారంలో మరో విడత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఇందుకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల అధికారులు, అధిపతులు ఆదివారం ఉదయం 10 గం.లలోపు అర్హులైన ఉద్యోగుల వివరాలను vaccinationeg@gmail.com  మెయిల్ ఐడికి , లేదా హార్డు కాపీ కలెక్టరేట్ లోని కోవిడ్ విభాగానికి తప్పని సరిగా అందజేయాలని తెలిపారు.  ఆదివారం సాయంత్రం 6 గం.లలోపు శాఖలు, సంస్థలకు రెడ్ కలర్ కూపన్లు అందజేయడం జరుగుతుందని, శాఖాధికారుల ద్వారా కూపన్లు పొందిన ఉద్యోగులు తమ శాఖాపరమైన ఫొటో ఐడి కార్డు, ఆధార్ కార్డు లతో ఆయా డివిజన్ కేంద్రాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలలో టికాలు పొందాలని తెలిపారు. కార్యాలయ పనులకు విఘాతం లేకుండా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పంపిణీకి ఒక్కక్క రోజన ఆయా శాఖల నుండి మూడో వంతు ఉద్యోగులను మాత్రమే హాజర్యేట్లు చూడాలని సూచించారు.   హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ సర్వీస్ లకు సంబంధించి 45 ఏళ్లు లోపు ఉద్యోగులు కూడా ఈ ప్రత్యేక పంపిణీకి హాజరు కావచ్చనని తెలిపారు.  ఏ కారణం చేతననై  ఈ మూడు రోజుల్లో హాజరు కాలేక పోయిన వారు ఆందోళన చెందనవసరం లేదని, అటువంటి వారు తమ రెడ్ కూపన్లతో రిగ్యులర్ గా మంగళ, శుక్రవారాల్లో జరిగే పంపిణీలో టీకా వేయించుకోవచ్చుని తెలిపారు. ఈ ప్రత్యేక టీకాల పంపిణీకి అర్హులైన ఉద్యోగులను మాత్రమే ప్రతిపాదించాలని, ఆయా డివిజనల్ కేంద్రాల వద్ద ప్రతి శాఖ నుండి ఒక సమన్వయ అధికారిని మూడురోజుల పాటు నియమించాలని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  తక్కవ వయసు వారు, ఉద్యోగులు కాని వారు వంటి  అనర్హులైన వారెవరైనా ఈ టీకాల పంపిణీకి హాజరైతే సంబంధిత అధికారులపై చర్య చేపడతామని స్పష్టం చేశారు.  ప్రభుత్వ శాఖలతో పాటు పోస్టల్, రైల్వేస్, ఎఫ్సిఐ, బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు, షాపులు, మాల్స్, మెడికల్ షాపులు, హొటళ్లు, రెస్టారెంట్లు, మేరేజి ఫంక్షన్ హాళ్ల తదితర సంస్థల ఉద్యోగులకు కూడా ఈ కేంద్రాలలో టీకాలు వేస్తారన్నారు.  అర్హులైన ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు అందరూ ఈ ప్రత్యేక పంపిణీ సద్వినియోగం చేసుకునేలా చూడాలని అయా శాఖల, సంస్థల అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) జి.లక్ష్మిశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ)  జి.రాజకుమారి, సబ్ కలెక్టర్లు, ఆర్డ్ఓలు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.