సెప్టెంబరు 1నాటికి 650 పడకలు సిద్దం కావాలి...


Ens Balu
2
vims hospital vizag
2020-08-28 19:10:56

విశాఖలోని విమ్స్ ఆసుపత్రిలో గల 650 పడకలను సెప్టెంబరు ఒకట నాటికి వినియోగంలోనికి తీసుకురావాలని జిల్లా కలెక్టరు  వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆ దేశించారు.  శుక్రవారం ఆయన విమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసారు. సిబ్బంది పనితీరు పర్యవేక్షణలో భాగంగా సీ.సీ. కెమోరా పుటేజీని పరిశీలించారు. అనంతరం వై ద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రిలో గల 216 ఐ.సి.యు, 434 ఆక్సిజను సదుపాయలు గల  650 ప డకలను పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండాలన్నారు. అందుకు కావలసిన  సిబ్బందిని, పరికరాలను  వెంటనే సమకూర్చుకోవాలన్నారు. ఇటీవల రిక్రూట్ చేసి న అభ్యర్థులకు వెంటనే నియామకపత్రాలు  అందజేయాలని తెలిపారు.  సిబ్బందిని మూడు షిప్టులుగా విభజించి, ప్రతి షిప్టుకు ఒకరిని భాద్యునిగా నియమించాలని తె లిపారు.  మూడు షిప్టులలో  నియమించిన సిబ్బంది వివరాలు తనకు అందజేయాలని ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చవలసినదిగా ఆంధ్రా మెడి కల్ కాలేజీ  ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.