ఫలించిన జివిఎంసీ కమిషనర్ వ్యూహం..


Ens Balu
1
GVMC office
2021-05-23 12:01:46

విశాఖలో కరోనా వైరస్ కేసులు అధికమవుతున్నవేళ ఆ వ్యాప్తిని తగ్గించేందుకు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన రచించిన ప్రత్యేక వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. ఆదివారం మాంసం దుఖాణాలు నిషేధించడంతో అత్యధికశాతం మంది రోడ్లపైకి రావడం బాగా తగ్గింది. అధిక జనాబా కేవలం మాంసం, చేపలు, రొయ్యలు, దుఖాణాల వద్దే గుమిగుడటంతో వైరస్ వ్యాప్తి అధికంగా వుందనే కారణంతో కమిషనర్ తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలై జనసాంద్రత  తగ్గింది. అంతేకాకుండా కర్ఫ్యూ లో విషయంలో నిబంధనలు పక్కాగా అమలు చేయడంతో జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి మాంసం నిషేధం కరోనా ప్రభావం వున్నంత కాలం విధిస్తే చాలా వరకూ కేసులు తగ్గొచ్చుననే వాదన వినిపించడం విశేషం.. భౌతిక దూరం పాటించడం, మాస్కుధారణ విశాఖనగరంలో బాగా కనిపిస్తోంది. ఇదే పద్దతి కొనసాగితే త్వరలోనే కరోనా వైరస్ కేసులు మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలో తగ్గుముఖం పట్టే అవకాశముంది. అంతేకాకుండా రైతు బజార్ల వద్ద కూడా భౌతిక దూరం, మాస్కు ధారణ ఉంటే తప్పా ప్రవేశం లేదనే నియమ నిబంధనలు కూడా పెట్టాలనే నగరవాసులు కోరుతున్నారు. వ్యాపారులకు ఈ విధానాలు కష్టంగా ప్రజలకి మాత్రం కరోనా వైరస్ నుంచి మాత్రం కాస్త ప్రభావం తగ్గినట్టు కనిపించింది. అన్నిరకాల మీడియా, ప్రసార మాద్యమాల ద్వారా ఇలాంటి ఆదేశాలు ప్రజల్లోకి తీసుకెళ్లగాలిగితే విశాఖలో కరోనా వైరస్ కేసులు త్వరలోనే తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం వుంది..

సిఫార్సు