ఏకాంతంగా అప్పన్న వైశాఖ పౌర్ణమి..
Ens Balu
4
Simhachalam
2021-05-23 12:34:59
విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి ఈ నెల 26 వైశాఖ పౌర్ణమిని ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం దేవస్థానం తరపున మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, కోవిడ్ నిబంధనలు, అర్చకుల విన్నపం మేరకు వైశాఖ పౌర్ణమిని ఏకాతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా అదే రోజు శ్రీ స్వామివారికి రెండో విడత చందనం కూడా సమర్పిస్తారని చెప్పారు. స్వామికి జరిగే ఈ కార్యక్రమాలకు భక్తులకు 26న సింహగిరిపైకి అనుమతి లేదని పేర్కొన్నారు. వైశాఖ పౌర్ణమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశముండటంతో కిందినుంచే గేట్లు కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనావైరస్ ప్రభావం తగ్గేవరకూ శ్రీవారి ఆరాధనాది కార్యక్రమములన్ని ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆరోజు స్వామి కళ్యాణం జరపని కారణంగా భక్తులు కోనేరు వైపు కూడా వెళ్లకూడదని ఈఓ భక్తులను కోరారు. ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకొని భక్తుల దేవస్థాన అధికారులకు సహరించాలన్నారు.