కరోనాలో మంచి మనసుల సహాయం..
Ens Balu
2
Simhachalam
2021-05-23 14:28:30
కరోనా వైరజ్ విజ్రుంభిస్తున్న సమయంలో మనసున్న దాతలు వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు చేసే ఖర్చులను అనాదలు, ఆపన్నుల ఆకలి తీర్చడానికే వినియోగిస్తున్నారు. నా అనుకునేవారికి దూరమై ఆశ్రమాల్లో ఉంటున్నవారికి చిరు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖలోని మర్రిపాలెంకు చెందిన హరిహరన్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సింహాచలం శ్రీనివాస నగర్ లోవున్న శ్రీ బంగారుతల్లి వ్రుద్ధాశ్రమంలోని వ్రుద్ధులకు పండ్లు పౌష్టిక ఆహారాన్ని అందించారు. ఈ ప్రాంతంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే సామాజిక వేత్తర విజినిగిరి బాలభానుమూర్తి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టారు దాతలు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో దాతలు చేసే సహాయం తమ పరిధిలో ఇలాంటి ఆనాధలకు చేయడం ద్వారా వ్రుద్ధులకు మేలు చేసినవారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తంగుడు పవన్ కుమార్, ఎల్.గణేష్, పుష్పలత, నదీమ్ తదితరు పాల్గొన్నారు.