కోవిడ్ విజేతలకు ప్లాస్మాదానంపై అవగాహన కల్పించాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-08-28 19:19:29

విశాఖజిల్లాలో 2నెలల్లో కోవిడ్  నుండి కోలుకున్న వారి నుండి ప్లాస్మా దానం చేసేలా రోగులను చైతన్యపరచాలిని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వైద్యఆరోగ్యశాఖ అధి కారులను ఆదేశించారు.  అలా ముందుకు వచ్చిన వారి నుంచి ప్లాస్మా సేకరించాలని తెలిపారు. వారికి ప్లాస్మాదానంపై అన్ని ప్రాంతాల్లోనూ  అవగాహన కల్పించాలని తెలిపారు. ఫ్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహక బహుమతిగా  ప్రభుత్వం అందిస్తున్న 5వేల రూపాయలను మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా  డిఎంహెచ్ఓని ఆదేశిం చా రు. ప్లాస్మాదానంపై అన్ని వర్గాలకు తెలిసేలా ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు.  కె.జి.హెచ్., ఇ.ఎన్.టి.,రాణి చంద్రమతి దేవి ఆసుపత్రి, ప్రాంతీ య కంటి   ఆసుపత్రులలో గల 300 పడకలను తక్కువ రిస్క్ గల పేషెంట్లకు కేటాయించి వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డెరెక్టరు డా. వరప్ర సాద్, ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. సుధాకర్,  కె.జి.హెచ్. సూపరిండెంటింగు ఇంజనీరు ,  ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి పాల్గొన్నా రు.