తూర్పు మధ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు జిల్లా కలెక్టర్ కు సూచించారు. యాస్ తుఫాన్ పై జిల్లా కలెక్టర్ ఏం. హరి జవాహర్ లాల్ తో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో తీసుకోవలసిన జాగ్రత్తల పై పలు సూచనలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా చెరువులకు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ నష్టాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభావిత ప్రాంతాల, తీరప్రాంతాల ప్రజలను పురనరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు.
యాస్ తుఫాన్ సోమవారం సాయంత్రానికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని దిశ ను ఎప్పుడైనా మార్చుకోవచ్చునని, ముందస్తుగా సర్వం సిద్ధం కావాలని ఆదేశించారు.