కోవిడ్ ఖైదీ బెయిల్ పై విడుదల..
Ens Balu
2
Vizianagaram
2021-05-24 12:43:27
కోవిడ్ బారిన పడ్డ ఒక ఖైదీని, జిల్లా జైలు అధికారులు బెయిలుపై విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు, విజయనగరం సబ్‌జైలులోని అండర్ ట్రయిల్ ఖైదీలు, సిబ్బందికి ఈ నెల 21న కోవిడ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 28 మంది ఖైదీలు, 10 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఒక్క ఖైదీకి మాత్రమే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆ ఖైదీని బెయిలుపై విడుదల చేసి, హోమ్ ఐసోలేషన్‌కు పంపించినట్లు జైలు సూపరింటిండెంట్ దుర్గారావు తెలిపారు.