చిన్నారుల కోసం రెండు 108 అంబులెన్సులు సిద్ధం..


Ens Balu
4
Srikakulam
2020-08-28 19:25:04

శ్రీకాకుళం జిల్లాలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా 108 అత్యవసర సేవలు ప్రారంభించినట్టు జెసి డా. కె.శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రూపోందించిన 108 అత్యవసర సేవల  గోడపత్రికను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య, 108 వాహనాల జిల్లా మేనేజర్ పి. వెంకట రమణలతో కలిసి జె.సి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లాలో 108 అత్యవసర సేవల వాహనాలు పెద్దలకు మాత్రమే వినియోగించడం జరిగిందని, ప్రస్తుతం చిన్నారుల కోసం ప్రత్యేకంగా రెండు 108 వాహనాలు జిల్లాకు రావడం విశేషమన్నారు. ఈ వాహనాలు మాతా, శిశు మరణాలు ఎక్కువగా ఉన్న టెక్కలి మరియు పాలకొండ రెవిన్యూ డివిజన్లకు కేటాయించడం జరిగిందని చెప్పారు. ప్రత్యేకంగా చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన 108 వాహనాలు ప్రసూతి కేంద్రం మరియు నవజాత శిశు సంరక్షణ కేంద్రాలకు అనుసంధానం చేయబడ్డాయని ఆయన స్పష్టం చేసారు. ఈ 108 వాహనాల్లో చిన్నారుల కోసం వెంటి లేటర్, ఆక్సిజన్, నవజాత శిశువులకు కోసం ప్రత్యేకమైన పెట్టె మరియు అవసరమైన మందులు ఇందులో ఉంటాయని జె.సి వివరించారు.