తుఫాన్ ఎదుర్కోవడానికి జివిఎంసి సన్నద్దం..


Ens Balu
2
GVMC office
2021-05-24 12:57:03

తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన  “యాస్” తుఫాను తీవ్రతను ఎదుర్కోవడానికి జివిఎంసి అన్ని విధాలా సన్నద్ధంగా వుందని కమిషనర్ డా.జి.స్రిజన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సంభిత విభాగాలతో సమీక్ష నిర్వహించారు. తుఫాను వలన అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కాలువలు, గెడ్డలు  పొంగకుండా చూడాలని అవసరమైన చోట్ల, ముంపు ప్రాంతాలలో మోటార్లను ఉపయోగించాలని సూచించారు.  చెట్లు, కొమ్మలు తో పాటు ఎలక్ట్రికల్ పోల్స్ విరిగి రోడ్లపై పడిన వెంటనే వాటిని తొలగించుటకు అవసరమైన  రంపములను, వాహనములను సిద్ధంగా ఉంచుకోవాలని మొక్కల విభాగం,ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  పాత భవనాలలో నివసిస్తున్న వారిని శిధిలమైన గోడల ప్రక్కన నివసిస్తున్న వారిని అక్కడ నుంచి అనువైన  షెల్టర్ లోకి వెళ్ళే విధంగా చూడాలని ఆదేశించారు. నిరాశ్రయులను వెంటనే కోవిడ్ నిబంధనల ప్రకారం కమ్మ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపంలు లాంటి షెల్టర్లకు తరలించి వారికి భోజనం, మంచినీటి సదుపాయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని యుసిడి అధికారులకు సూచించారు. ప్రతీ సచివాలయ పరిధిలో ఉన్న  నివాసితుల ను అప్రమత్తంగా ఉండే విధంగా జోనల్ కమిషనర్లు సచివాలయంలో ఉన్న అందరు కార్యదర్శులను సిద్ధం చేయాలని ఆదేశించారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణార్ధం అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను వలన చెట్లు కొమ్మలు విరిగిపడ్డ,  గెడ్డలు పొంగి రహదారులపైకి, ఇండ్లలోనికి వరదనీరు చేరి ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా 0891-2869100కి సమాచారం అందజేయాలని కమిషనర్ నగర వాసులను కోరారు.
సిఫార్సు