ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో సోమవారం ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్ల వారు జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన చేపట్టారు. గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి అనంతరం యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలుజరిపారు. ఆ తర్వాత ధన్వంతరి హోమం , సుదర్శన యాగం నిర్వహించారు. ఈ సదర్భంగా అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి మాట్లాడుతూ, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని. ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ ధన్వంతరీ హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు ను కరోనా భయం వెంటాడుతుందని, ఇలాంటి సమయంలో ధన్వంతరి హోమం నిర్వహిస్తే స్వామి ధయతో ఆభయాల తోపాటు వ్యాధులు రుగ్మతలు కూడా పూర్తిగా తొలగి పోతాయని ఈ మహాకార్యం చేపట్టినట్టు చెప్పారు. స్థానాచార్యులు రాజగోపాల్ మాట్లాడుతూ, గతంలో కంచితో పాటు అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు సంభవించినప్పుడు ఈ తరహాలోనే అక్కడ ధన్వంతరీ హోమం తో పాటు అష్టకమ్ పఠనం చెయ్యడం తో ఆ ప్రాంతంలో వ్యాధులు, జబ్బులు, భయాలు పూర్తిగా మటుమాయం అయ్యాయన్నారు తెలియజేశారు. దేవ వైద్యులైన ధన్వంతుడ్ని పూజిస్తే సర్వ రోగాలు హరించుకు పోతాయని..త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవో ఎంవీ సూర్యకళ తో పాటు ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు, ట్రస్టుబోర్డు సభ్యుడు నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమచార్యులు, పురోహితులు కరి సీతా రామా చార్యులు, రాజీవ్ లోచన తో పాటు పలువురు అర్చకులు..వైదిక వర్గాలు పాల్గొన్నాయి. హోమం అనంతరం ఆలయ బేడా మండపం లో పూజలు జరిపిన కలిస తో ప్రదక్షిణ లు నిర్వహించి స్వామికి చూపించారు. నిత్యకళ్యాణంకూడా ఘనంగా నిర్వహించారు.