ఫీవర్ సర్వే పారదర్శకంగా చేయాలి..


Ens Balu
4
Ongole
2021-05-24 14:07:34

ప్రకాశం జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ ఇంటింటా ప్రతి ఒక్కరికీ నిర్వహించే జ్వర పీడితుల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని  జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్  సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఒంగోలు మండలంలోని మందువవారిపాలెంలో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం డిపీఓ  మాట్లాడుతూ,  మే నెలాఖరు వరకు 11 విడతలుగా సర్వే చేయాల్సి ఉంటుందని సిబ్బందికి వివరించారు.  ఈ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు, వి ఆర్ ఓ లు, సచివాలయ సిబ్బంది, ఎఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, సచివాలయాల వలంటీర్లు మమేకమై ప్రతీ గృహాన్ని సందర్శించి సభ్యులు వారీగా సర్వే చేయాలన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ సూచనలు పాటిస్తూ చేపట్టాలన్నారు.  జ్వరం, దగ్గు‌‌, రొంప, అయాసం వంటి ప్రాధమిక లక్షణాలును గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా అంతర్జాలంలో నమోదు చేయాలని  ఆదేశించారు. ఈ సర్వేలో రోగాలని తేలిన వారికి అవసరమైన మందులను నేరుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి తీసుకుని వచ్చి బాధితులకు ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రల జాబితా ఆధారంగా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి ఆయాన కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు