సచివాలయంలోనే సమస్య పరిష్కారం కావాలి..
Ens Balu
4
Maddipadu
2021-05-24 14:23:24
ప్రజల సమస్యలు గ్రామసచివాలయంలోనే పరిష్కరించే విధంగా సిబ్బంది సేవలందించాలని ప్రకాశంజిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఒంగోలు మండలంలోని మద్దిపాడు, లింగంగుంట గ్రామ సచివాలయాలను డిపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ ప్రజలకు అందుతున్న సేవల వవరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూనే ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఎవరినీ వివిధ రకాల ద్రువీకరణ పత్రాల కోసం పదే పదే సచివాలయం చుట్టూ తిప్పడానికి వీలు లేదన్నారు. ఫీవర్ సర్వే, వాక్సినేషన్ డ్యూటీలు చేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా డిపిఓ అభినందించారు. తరువాత రికార్డులను పరిశీలించారు. గ్రామంలో కరోనా అదుపులోకి వచ్చేంత వరకూ శానిటేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు, పాజిటివ్ వచ్చిన వారి ఇల్ల వద్ద బ్లీచింగ్ చల్లించారు. విధులకు వచ్చే సిబ్బందితోపాటు, వివిధ పనులపై వచ్చే ప్రజలకు కూడా మాస్కులు ధరించకపోతే కార్యాలయంలోకి అనుమతించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.