నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదు..


Ens Balu
1
Collector Office
2021-05-24 14:53:47

విశాఖ నగరంలోని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, కొవిడ్‌ రోగుల నుంచి అధిక చార్జిలు వసూళ్లు చేయడంతో పాటు, 50శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయింపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరించిన ఆరు ఆసుపత్రులకు భారీగా జరిమానాలు వేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌(విలేజ్‌, వార్డు సచివాలయం అండ్‌ హెల్త్‌), ఆరోగ్యశ్రీ అడిషనల్‌ సీఈవో పి.అరుణ్‌బాబు తెలిపారు. సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో డిస్ట్రిక్ట్‌ డిస్ల్‌ప్లేనరీ కమిటీ(డిడిసి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు, సభ్యులుగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, డిఎంహెచ్‌వో డాక్టర్‌ పిఎస్‌ సూర్యనారాయణ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్ కె. రాజేష్‌ పాల్గొన్నారు.  నగరంలోని ఆరోగ్యశ్రీ తాత్కాలిక ఆసుపత్రులతో పాటు, కొవిడ్‌ ఆసుపత్రులుగా ఉన్న వాటికి ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు పాటిస్తూ ఆరోగ్యశ్రీకి 50శాతం పడకలు కేటాయించాలని నోటీసులు జారీ చేసి, పలు సార్లు హెచ్చరించినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రానందున వారందరికీ జరిమానాలు విధించామని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. అయితే రోగులకు అందుతున్న సేవల్లో లోపాలను ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ గుర్తించారని,  వివరాల మేరకు  ఆయా ఆసుపత్రులకు డిఎంహెచ్‌వో జరిమానాలు విధించారు. అయితే వీటిలో  ఎఎన్‌బీచ్‌ ,  కెకెఆర్‌,రమ్య, ఎస్‌ఆర్‌ ఆసుపత్రులకు రూ.లక్ష చొప్పున,  ఆసుపత్రి, శ్రద్ద, ఆదిత్య ఆసుపత్రిలకు రూ.రెండు లక్షల చొప్పున మొత్తం జరిమానా లు విధించామన్నారు. జెమ్స్‌ , దుర్గా ఆసుపత్రిలకు కేవలం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. నగరంలోని ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులతో పాటు, తాత్కాలికంగా అనుమతి పోందిన ఆసుపత్రులకూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీలో 50 శాతం పడకలు కేటాయింపుతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన ధరలనే వసూళ్లు చేయాలని లేని పక్షంలో మిగిలిన ఆసుపత్రులను సైతం తనిఖీలు నిర్వహించి వారిపై జరిమాలను, కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆదిత్య ఆసుపత్రి యాజామాన్యం వారు వారం రోజుల లోపు ఆరోగ్యశ్రీ సేవలు అందించకపోతే సదరు ఆసుపత్రికి భారి జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు.
సిఫార్సు