కరోనా సమయంలో దాతలు చేసే సహాయ సహకారాలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ (ఏ అండ్ డబ్ల్యూ) జి.రాజకుమారిని కొనియాడారు. కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ (సీఎస్‌సీ), అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డా. కేవీ రమణరావు సామాజిక బాధ్యతగా రూ.మూడు లక్షల విలువైన మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, గ్లూకోజ్ మీటర్లను జిల్లాకు అందించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో జెసిని కలిసి కాన్సంట్రేటర్లు, గ్లూకోజ్ మీటర్లను అందజేశారు. సామాజిక బాధ్యతగా కోవిడ్ బాధితులకు తమ వంతు సహాయం అందించాలనే గొప్ప మనసుతో చికిత్స ఉపకరణాలను అందించిన డా. కేవీ రమణరావును జేసీ అభినందించారు. ఈవిధంగానే మరింత మంది దాతలు ముందుకు రావడం ద్వారా ప్రాణ నష్టం అధిక సంఖ్యలో బాధితులకు సత్వర వైద్యం అందించడానికి వీలుపడుతుందని జెసి సూచించారు.