కరోనా బాధితుల కోసం NFCL 12 ఆక్సిజన్ మిషన్లు..


Ens Balu
2
Kakinada
2021-05-25 13:09:18

కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, బాధితుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేప‌డుతున్న చ‌ర్య‌ల్లో భాగ‌స్వామ్యం అవుతూ నాగార్జున ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌సీఎల్‌) 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను జిల్లాకు స‌మ‌కూర్చింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని క‌లిసి ఎన్ఎఫ్‌సీఎల్ ప్ర‌తినిధులు కాన్సంట్రేట‌ర్ల‌ను అందించారు. సామాజిక బాధ్య‌త‌గా కోవిడ్ రోగుల‌కు ప్రాణ‌వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన ఎన్ఎఫ్‌సీఎల్‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. దాదాపు రూ.11 ల‌క్ష‌ల‌తో అయిదు లీట‌ర్ల సామ‌ర్థ్యంగ‌ల 12 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను సామాజిక బాధ్య‌త‌గా సంస్థ అందించిన‌ట్లు ఎన్ఎఫ్‌సీఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ (పీఆర్‌) వి.ర‌వికుమార్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, ఎన్ఎఫ్‌సీఎల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ (హెచ్ఆర్‌) వై.ర‌మాదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.
సిఫార్సు