కరోనా రోగుల కోసం DCMS 5 ఆక్సిజన్ మిషన్లు..
Ens Balu
2
Kakinada
2021-05-25 13:10:59
వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగస్వామ్యం అవుతూ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) రూ.4,14,000 విలువైన అయిదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జిల్లాకు అందించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎంఎస్ ఛైర్మన్ డా. జి.లక్ష్మీశ; డీసీఎంఎస్ అధికారులు.. మంగళవారం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి అందజేశారు. కోవిడ్ బాధితులకు అండగా నిలవాలనే ఓ మంచి ఉద్దేశంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిన డీసీఎంఎస్‌కు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి సొసైటీని అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, డీసీఎంఎస్ సీఈవో పీబీఎం కుమార్, మేనేజర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.