తుపాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం..


Ens Balu
2
Vizianagaram
2021-05-25 13:18:26

యాస్ తుఫాన్ ను ఎదుర్కొడానికి జిల్లాలో  అన్ని  రకాల ముందస్తు ఏర్పాట్లతో యంత్రాంగాన్నిసిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు.  మంగళ వారం  పంటల బీమా పధకం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర కు చెందిన ముగ్గురు జిల్లా కలెక్టర్లతో తుఫాన్ ఏర్పాట్ల పై సమీక్షించారు.  భారత వాతావరణ విభాగం చేస్తున్న  తుఫాన్ హెచ్చరికలను  అనుసరిస్తూ పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.  కోవిడ్ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆక్సిజన్ నిల్వలు , మందులు, ఆహారం  రానున్న నాలుగు రోజుల వరకు నిల్వలు చేసుకోవాలని  సూచించారు.  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ముగ్గురు కలెక్టర్ల పై పూర్తి నమ్మకం ఉందని, బాగా పనిచేస్తారని కలెక్టర్లకు  అభినందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. హరి జవాహర్ లాల్ ముఖ్యమంత్రి తో  మాట్లాడుతూ    జిల్లాలో 5  కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయడం జరిగిందని,  మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశామని, తుఫాన్ షెల్టర్ల ను ఏర్పాటు చేసి  నిత్యవసర సరుకులను కూడా సిద్ధం చేశామని తెలిపారు.  తీర ప్రాంతాల్లో పశువుల రక్షణకు షెల్టర్లను  ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.  తుఫాన్ వలన విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఇబ్బంది లేకుండా కోవిడ్ ఆసుపత్రుల్లో రానున్న నాలుగు రోజులకు జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఆసుపత్రులకు అవసరమగు మందులు, మెటీరియల్ ను ముందుగానే ఇండెంట్ తీసుకొని  ఆక్సిజన్ ను రిజర్వ్ లో పెట్టడం జరిగిందన్నారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో కూడా సిలిండర్ లను సిద్ధం చేశామన్నారు. భోగాపురం ఆసుపత్రి లో 5 గురు కోవిడ్ రొగులు ఉన్నారని, అవసరమైతే వారిని షిఫ్ట్ చేయడానికి ప్రత్యామ్నాయం చూశామన్నారు.   విద్యుత్, జల వనరులు, ఆర్ అండ్ బి, రైల్వే  శాఖల వారితో సమీక్షించడం జరిగిందని, వారు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  వరి, మొక్క జొన్న పంటలు నష్టం జరగకుండా రైతులకు టార్పాలిన్ లను అందించేలా  రైతు భరోసా కేంద్రాలను అలెర్ట్ చేయడం జరిగిందన్నారు.  భారత వాతావరణ సంస్థ నుండి ఎప్పటికప్పుడు అందిన హెచ్చరికలను జిల్లా అధికారులందరికి  గ్రూప్ ద్వారా పంపుతున్నామని తెలిపారు.  ఒరిస్సా లో వర్షాలు ఎక్కువగా కురిస్తే నాగావళి పొంగే అవకాశం ఉన్నందున, నదీ పరీవాహక ప్రాంతాలలో ప్రత్యేక అలెర్ట్స్ ను పంపడం జరుగుందని,  ఒరిస్సా కు చెందిన కలెక్టర్ లతో పరిస్తితి పై ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతోందని, సబ్ కలెక్టర్, పి.ఓ ల పర్యవేక్షణ లో  ఒక బృందం పని చేస్తోందని అన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో  యాస్  తుఫాన్ కారణంగా వర్షపాతం నమోదు కాలేదని, ఎలాంటి గాలులు, ఉరుములు  లేవని, వాతావరణం ప్రశాంతంగా ఉందని వివరించారు.  ఈ  వీడియొ కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు పాల్గొన్నారు. 
సిఫార్సు