తూఫాన్ ఎదుర్కోవడానికి NDRF బ్రుందాలు..


Ens Balu
2
Srikakulam
2021-05-25 13:28:24

యాస్ తుఫాన్ వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్థార్ ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దువనిపాలెం వంటి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను ఆదేశించారు. బృందాలు మంగళవారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. లైఫ్ జాకెట్స్, విద్యత్ రంపాలు, టార్చ్ లైటులు, డ్రాగన్ లైట్లు, రోపులు అత్యవసర సమయాల్లో వినియోగించే ఇతర సామగ్రితో యస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రజలను, పశువులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, రోడ్డు మార్గంలో చెట్లును తొలగించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కవిటి పోలీసు స్టేషన్ లో వాహనాలు, జే.సి.బిలను ఏర్పాటు చేశారు.
సిఫార్సు