తడి –పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి..


Ens Balu
1
MVP Colony
2021-05-25 13:33:08

మహావిశాఖ నగర పరిధిలోని ప్రజలు శానిటేషన్ చెత్తవాహనాలకు తడి – పొడి చెత్త , ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి ఇవ్వాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. మంగళవారం మూడవ జోన్ ఎం.వి.పి. కోలనీ సెక్టార్-6 ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో  కమిషనర్ మాట్లాడుతూ తడి –పొడి చెత్త మరియు  ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది వచ్చి డోర్ టు డోర్ చెత్త సేకరిస్తున్నదీ లేనిదీ ఆరా తెసారు. ప్రతీ రోజు పారిశుధ్య కార్మికులు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయించాల్సిన బాధ్యత పారిశుధ్య మేస్త్రి, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు దగ్గరుండి చూచుకోవాలని, లేని యడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయి రత్న అపార్ట్మెంట్ వారు తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వనందున వారిపైన సంతోషిమాత కిరాణా జనరల్ స్టోర్స్ ముందు డస్ట్ బిన్స్ లేనందున వారిపైన ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఇరువురికి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరి సూపర్వైజర్ ను ఆదేశించారు. వర్షపు నీరు ఎక్కడా నిలువ ఉండకుండా చూడాలని, కాలువలు, గెడ్డలులలో ఉన్న చెత్తను సాయంత్రానికి శుబ్రం చేసి చెత్త తొలగించి వర్షపు నీటికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం వలన చెట్లు, కొమ్మలు విరిగిపడిన వెంటనే యుద్ద ప్రాతిపదికన తొలగించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. అనంతరం ఫీవర్ సర్వే జరుగుచున్న విధానాన్ని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక వాలంటీర్లుకు గాని, ఫీవర్ సర్వే బృందానికి గాని తెలియపరచాలని, కరోనా వైరస్ నకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాదికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.    
సిఫార్సు