జివిఎంసి సిబ్బందికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ..
Ens Balu
3
GVMC office
2021-05-25 13:37:29
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ సిబ్బంది ఆరోగ్యం కరోనా రహితంగా ఉంటేనే ప్రజలకు సత్వర సేవలు చేయడానికి ఆస్కారం వుంటుందని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జివిఎంసి సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసి వ్యాక్షినేషన్ సెంటరును ఆమె మంగళవారం ప్రారంభించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలో సిబ్బందికి అందరికి కోవేక్షిన్ రెండవ డోసు, కొవీషీల్డ్ మొదటి డోసు ప్రత్యేకంగా వేస్తున్నారన్నారు. దీనిని ప్రతీ ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకం అయి ప్రజల మధ్య ఉండవలసి ఉన్నందున వ్యాక్సిన్ తప్పని సరిగా అందరూ వేయించుకోవాలని సూచించారు. ఇటీవల కొంతమంది జివిఎంసి సిబ్బంది కరోనాతో మరణించారని, వారి అందరి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. అందువలన సిబ్బంది అందరు ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.