ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు..


Ens Balu
4
Visakhapatnam
2020-08-28 20:07:50

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 10,526 కేసులు నమోదై వీటి సంఖ్య నాలుగు లక్షలు దాటిపోయింది. 24గంటల్లో81 మంది మృతిచెందగా, వీరితో ఇప్పటి వరకూ మ్రుతి చెందిన వారు రాష్ట్రంలో 3,714గా నమోదయ్యారు. విశాఖ జిల్లాలో 24 గంటల్లో 6 గురు మృతి చెందగా, కొత్తగా 896 కేసులు నమోదు అయ్యాయి. దీనితో జిల్లాలో 34,206 కు సంఖ్య పెరిగింది. కాగా ఇప్పటివరకూ జిల్లాలో 2,74 మంది మృతిచెందారు. జిల్లాలో కేసులు అధికంగా వున్నందు ప్రజలు ప్రభుత్వం నిర్ధేశించిన మార్గద ర్శకాలను పాటించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కోరుతున్నారు. ప్రజల సౌకర్యార్ధం క్వారంటైన్ కేంద్రాలు నిర్వరామంగా నడుపుతున్నామన్న ఆయన కోవిడ్ లక్షణాలుంటే తక్షణమే పీహెచ్సీల ద్వారా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ ద్వారా కూడా చికిత్స తీసుకునే వెసు లుబాటు వుందన్న కలెక్టర్ పూర్తిస్థాయిలో మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.