మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కాలువలు, గెడ్డలు శుభ్రం చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటేషన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రర్యటనలో భాగంగా 8వ జోన్ పరిధిలో 90వ వార్డును ఆయన స్వయంగా పరిశీలించ శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లు, కాలువలు, గెడ్డలను శుభ్రం చేసి చెత్తను వెంటవెంటనే డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను కలక్షన్ చేయాలని, బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో చెత్తను వేయకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది డోర్ టు డోర్ చెత్తను సేకరించాలని, తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో 90వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శి, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.