గోశాలలో నృసింహ జయంతి..
Ens Balu
2
Simhachalam
2021-05-25 14:17:29
విశాఖలోని సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ గోశాలలో నృసింహ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ మహవిష్ణువు నాలుగో అవతారం నరసింహావతారం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు అవతరించిన సందర్భంగా స్వామికి ప్రతీఏడా ఈరోజున జయంతి నిర్వహించడం ఆనవాయితా వస్తుంది. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ భక్తిశ్రద్ధలతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో స్వామి కార్యక్రమాలు నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగానే చేపట్టారు దేవస్థాన అధికారులు..