స్పందన దరఖాస్తులపై అధికారులు పరిష్కారం చూపాలి..
Ens Balu
3
Tirupati
2020-08-28 20:33:06
స్పందన వినతులపై అధికారులు తక్షణమే స్పందించడంతోపాటు, దరఖాస్తులకు పరిష్కార మార్గాలు చూపించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష అన్నారు. శుక్రవారం తన చాంబరులో అధికారులతో స్పందన కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, రెవిన్యూ విభాగా అధికారులతో నగరంలో చాలా చోట్ల పన్నులు వేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఫిర్యాదు రాకుండా ఉండటం తో పాటు మొండి బకాయిలు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో అక్రమ కట్టడాలను ముందుగానే గుర్తించి వారికి నోటీసులు ఇవ్వ డంతో ఫైన్లు కూడా వేయాలన్నారు. ఆక్రమణలను, కట్టడాలను తొలిదశలోనే అడ్డుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. నగరంలో ఉన్న అపార్ట్మెంట్లు, భవనాలు పరిశీలించాలని, అవార్డు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అభివ్రుద్ధి పనులు చేయించాలని ఆదేశించారు.