అనంతపురం జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలకు తమవంతు సహాయంగా సాగర్ సిమెంట్స్ రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించింది. తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఈపీ రంగా రెడ్డి, హెచ్ ఆర్ శ్రీమన్నారాయణలు ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరుకు గంధం చంద్రుడికి అందజేశారు. గతంలో కోవిడ్ పై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండుకు రూ.25 లక్షల రూపాయలు, పోలీసు శాఖకు రూ.2 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లను అందజేయడమే గాక తాజాగా ఐదు లక్షల రూపాయల విరాళం అందించిన సాగర్ సిమెంట్స్ మేనేజ్ మెంటును కలెక్టర్ అభినందించారు. కరోనా సమయంలో దాతల సహాయం కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.