పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి..


Ens Balu
1
GVMC office
2021-05-25 15:53:33

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లోని సచివలయాల వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె “సిస్కొ వెబెక్స్” (CISCO Webex)ద్వారా  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సచివాలయాలలో ఒక పారిశుధ్య కార్మికుడు ఉంటె మరికొన్ని సచివాలయాల పరిధిలో 22 మంది వరకు ఉన్నారని వారిని సర్దుబాటు చేయాలని, ప్రతి వార్డు సచివాలయాలలో 7 నుండి 8 మంది పారిశుధ్య కార్మికులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు ఎవ్వరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో మనం ఎంతమందికి జీతాలు చెల్లిస్తున్నామో పూర్తి వివరాలు తెలియపరచాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆదేశించారు.  డోర్ టు డోర్ చెత్త సేకరణ సరిగా చేయడం లేదని దాని వలన బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తున్నారని, దీనిని అడ్డుకట్ట వేసే బాధ్యత శానిటరి ఇన్స్పెక్టర్, పారిశుధ్య మేస్త్రి, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.  డోర్ టు డోర్ చెత్త నిర్వహించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తడి – పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, ఆలా ఇవ్వని యడల చెత్త తీసుకోరాదని  శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. చికెన్ సెంటర్లు, మార్కెట్లు, హోటల్స్, రెస్టారెంట్లు వద్ద ప్రతి రోజు చెత్తను నిల్వ ఉంచకుండా చూడాలన్నారు.  ట్రీ వేస్ట్, రోడ్లపై చెత్త, ఇళ్ళల్లోని వేస్ట్, EPDCL వారు కట్ చేసిన ట్రీ వేస్ట్ ను మధ్యాహ్నం 12.00  గంటలలోపు డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. చెత్త నిర్వహన సరిగా లేదని కంప్లైంటు ఏ  రూపంలో వచ్చిన వాటిని పరిష్కరించి రీ-జోయండర్సు ఇవ్వాలని ఆదేశించారు. యూజర్ చార్జీలు వసూలుకు యాప్ రూపొందించాలని అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు ఆదేశించారు. జివిఎంసి సిబ్బంది వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఎంతమంది వేయించుకోవాలో, రండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలో తెలియపరచాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. రోడ్ స్వీపింగు మెషీన్ సరిగా పనిచేయడం లేదని వాటిని పరిశీలించాలని కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవిని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్)  చిరంజీవిని ,ఎఎంఒహెచ్ లు, శానిటరి ఇన్స్పెక్టర్ల తోనూ పాల్గొన్నారు. 
సిఫార్సు