దోమల నివారణకు “డ్రై” డే పాటించాలి..


Ens Balu
2
Madhurawada
2021-05-26 13:28:55

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా దోమల నియంత్రణకు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారానికి ఒక రోజుడ్రై పాటించాలని కమిషనర్ డా.జి.స్రిజన కోరారు. బుధవారం రెండవ జోన్ పరిధిలోని 7వ వార్డు మధురవాడ స్వతంత్ర నగర్ లో జివిఎంసి కమిషనర్  పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సీజనల్ వ్యాధులు దృష్టిలో పెట్టుకొని అందరు వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని, కుండీల లోని నీరు నిల్వ ఉంచకుండా ఎండబెట్టుకోవాలన్నారు. పరిసర ప్రాంతాల్లో కొబ్బరిబొండాలు, నీరు నిల్వ ఉండే వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి లాంటివి ఉండకుండా చూసుకోవాలన్నారు. కొందరి ఇంటివద్ద ఉన్న కుండీలను ఆమె స్వయంగా పరిశీలించి, మెలేరియా సిబ్బంది నిత్యం ప్రతి ఇంటిని పరిశీలించేలా చూడాలని  వెటర్నరి డాక్టరును ఆదేశించారు. తడి–పొడి చెత్త సేకరణ, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పై పారిశుధ్య సిబ్బంది వస్తున్నదీ లేనిదీ ఆరా తీసారు. రోడ్లు, కాలువలను, గెడ్డలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల ముందు డస్ట్ బిన్లు లేకపోవడంపై శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిని వివరణ కోరాలని జోనల్ కమిషనరును ఆదేశించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. ఫీవర్ సర్వే ఏ విధంగా జరుగుచున్నదని స్థానిక ప్రజలు అడిగితెలుసుకున్నారు. ఫీవర్ సర్వే బృందం వచ్చినప్పుడు వారికి సహకారం అందించి కరోనా వైరస్ ను అరికట్టాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, సహాయక ఇంజినీరు(వాటర్ సప్లై) శ్రీహరి, సహాయక ఇంజినీరు(వర్క్స్)   శ్రీనివాస్, వెటనరీ డాక్టరు కిషోర్, 7వ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు