అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..


Ens Balu
1
GVMC office
2021-05-26 13:33:24

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ రెండవ దశ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. జివిఎంసి సిబ్బంది  కోవిడ్-19 సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున భవన నిర్మాణాలపై సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నార్నారు.  దీనిని ఆసరాగా తీసుకొని భవన నిర్మాణదారులు, అనధికారంగా గాని, నిబంధనలకు విరుద్ధంగా గాని అనధికార ఫ్లోర్లు నిర్మిస్తే అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి కట్టడాలను గుర్తించి అవి ఏ దశలో ఉన్నవైననూ వాటిపై చర్యలు చట్టపరంగా తీసుకుంటామని హెచ్చరించారు. సదరు భవన యాజమాన్యంపై అపరాధ రుసుం విధించచడంతో పాటు, క్రిమనల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.
సిఫార్సు